: కామాంధుడిని ఉరితీసి చంపిన బీహార్ వాసులు!
పన్నెండు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ వ్యక్తిని ఉరితీసి చంపిన ఘటన బీహార్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో బాలిక అరుపులు, ఏడుపు విన్న ప్రజలు, ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చావచితగ్గొట్టారు. ఆపై అతనిని ఉరితీసి చంపారు. పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటనతో సంబంధమున్న ఒకరిని అరెస్ట్ చేశారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.