: ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల ఏరువాక!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు ఏరువాక మొదలు పెట్టారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో అసైన్డ్, సీలింగ్ అమలులో ఉన్న భూముల సేకరణపై చంద్రబాబు సర్కారు ఇంతవరకూ ఎటువంటి నిర్ణయాన్నీ ప్రకటించకపోడవంతో కోపంతో మండిపడుతున్న రైతులు తమ ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని చెప్పి, భూ సేకరణపై స్పష్టత ఇవ్వాలని, మిగతా రైతులకు ఇస్తున్నట్టే తమకూ పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పొలాల్లోకి ఎద్దులను నడిపించి, నాగళ్లు కట్టి, దుక్కి దున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే, పంటలు వేసుకుంటామని వారు హెచ్చరించారు.