: ఆ ముష్కరులు పాకిస్థాన్ నుంచే వచ్చారు: పార్లమెంటులో తేల్చి చెప్పిన కేంద్ర హోం మంత్రి
పంజాబ్ లోని గురుదాస్ పూర్ పై దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ లో ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత వారి వద్ద జీపీఎస్ పరికరాలు లభించాయని... వాటి ప్రకారం ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి రావి నదిని దాటి వచ్చారని స్పష్టమయిందని తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులు సైనిక దుస్తుల్లో ఉన్నారని... వారి వద్ద ఏకే47లు, చైనా తయారీ గ్రెనేడ్ లు ఉన్నాయని చెప్పారు. కనీసం ఒక్క ఉగ్రవాదినైనా ప్రాణాలతో పట్టుకోవాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదని తెలిపారు.