: ఆఫీసుల్లో స్పెషల్ గా కనిపించాలా? ఇలా చేయండి!


టిప్పుటాపుగా తయారై వెళితేనో, అందంగా ఉంటేనో, లేకపోతే, కీలక పోస్టులో ఉండి అధికారం చెలాయిస్తేనో మిగతావారిలో ప్రత్యేకంగా ఉండవచ్చనుకుంటే పొరపాటు. ఇవన్నీ సెకండరీ. వీటికన్నా ముఖ్యమైనది చక్కటి నైపుణ్యం, అందరితో కలుపుగోలుతనం, మంచి వ్యక్తిత్వం. అవి ఉంటే మిగతావారు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారనడంలో సందేహం లేదు. ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని సూచనలు... * నఖశిక పర్యంతమూ శుభ్రత ముఖ్యం. సాధ్యమైనంత సింపుల్ గా ఉండాలి. ఘాటు వాసనలు వచ్చే డియోడరెంట్లు వాడక పోవడమే మంచిది. మరీ ఆధునిక దుస్తులు ధరించి వచ్చినా ఇబ్బందే. మిమ్మల్ని మరింత అందంగా, హుందాగా చూపించే దుస్తులను ఎంచుకోవాలి. * ఆఫీసుల్లో ఏ ఒకరిద్దరితోనో కలివిడిగా ఉంటూ, వారితోనే మాటలు కలుపుతుంటే ప్రత్యేకంగా నిలవలేరు. అందరితో పరిచయం పెంచుకోవాలి. మాటల్లో చిరునవ్వు చిందాలి. ఇతరుల పర్సనల్ విషయాల్లోకి తలదూర్చకూడదు. ఎల్లప్పుడూ హద్దుల్లో ఉండాలి. అలా ఉంటే మీపై అందరికీ గౌరవం పెరుగుతుంది. * ఒకరి గురించి మరొకరి వద్ద ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు అసలు చేయకూడదు. పక్కవాళ్లు మరొకరి గురించి ప్రస్తావించినా, ఆ మాటలను ఆపే ప్రయత్నం చేయాలి. * ఆఫీసుల్లో ప్రత్యేకంగా నిలిపే మరో గుణాల్లో 'సహాయం చేయడం' మరో ముఖ్యమైన అంశం. తోటి ఉద్యోగి ఏదైనా ఆపదలో ఉన్నాడంటే వెంటనే స్పందించాలి. చేయగలిగిన సాయం చేసేందుకు వెనుకాడకూడదు. వీలైతే ఇతరులనూ ప్రోత్సహించి, అందరూ కలిసి సహాయపడాలి. ఇలా చేస్తే మీలోని నాయకత్వ లక్షణాలు నలుగురికీ తెలుస్తాయి. అవి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. * ఇక ఇచ్చిన పనిని సకాలంలో వీలైతే, అంతకన్నా కాస్తంత ముందుగా పూర్తి చేయడం పైఅధికారుల్లో మిమ్మల్ని స్పెషల్ గా ఉంచుతుంది.

  • Loading...

More Telugu News