: మెమన్ ఉరితీతపై శశిథరూర్ భిన్న స్పందన


యాకుబ్ మెమన్ ను ఉరితీయడంపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓ మనిషిని ఉరి తీసిందనే వార్త తనను చాలా బాధపెట్టిందని ట్విట్టర్ లో పోస్టు చేశారు. మరణదండన వల్ల ప్రతికూల ఫలితాలే తప్ప సానుకూల ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు. అయితే క్రూరమైన ఉరితీతలు ఉగ్రవాదాన్ని నిలువరించలేకపోయాయని థరూర్ వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు చర్య, ప్రతీకార హత్య తప్ప మరొకటి కాదన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, ప్రభుత్వం చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News