: కలాం అంత్యక్రియల్లో అన్నీ తానైన వెంకయ్య... రెండు రోజులుగా రామేశ్వరంలోనే మకాం!
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం తమినాడులోని రామనాథపురం జిల్లాలో ఆయన సొంతూరు రామేశ్వరంలో ముగిశాయి. మూడు రోజుల క్రితం షిల్లాంగ్ లో తుది శ్వాస విడిచిన కలాం భౌతిక కాయాన్ని ఆ మరునాడు ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో కలాం పార్థివదేహానికి నివాళులర్పించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఆ తర్వాత కలాం అంత్యక్రియలు ముగిసేదాకా అన్నీ తానై వ్యవహరించారు. ఢిల్లీ నుంచి మధురై మీదుగా రామేశ్వరం వచ్చిన కలాం భౌతిక కాయం వెంట రక్షణ శాఖ మనోహర్ పారికర్ తో కలిసి వచ్చిన వెంకయ్యనాయుడు రెండు రోజులుగా రామేశ్వరంలోనే మకాం పెట్టారు. కలాం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కలాం భౌతిక కాయానికి తుది నివాళి అర్పించిన వెంకయ్య, అంత్యక్రియలు ముగిసన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.