: జన్మస్థలంలోనే కలాంకు స్మారక మందిరం


దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు పుట్టిన ఊరులోనే స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రామేశ్వరంలోనే ఆయన స్మారక మందిరం నిర్మాణం జరగనుంది. మొదట ఢిల్లీలోని గాంధీ సమాధి పక్కన దాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కుటుంబ సభ్యులు మాత్రం రామేశ్వరంలోనే నిర్మించాలని కోరారు. ఆ మేరకు తగిన స్థలాన్నిపరిశీలించాలని కలెక్టర్ ను ఆదేశించడంతో పేక్కరుంబులో ప్రభుత్వానికి చెందిన 1.32 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. రామేశ్వరం బస్ స్టాండు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

  • Loading...

More Telugu News