: ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో విచారణ... టీ సర్కారు వకీలుగా రాం జెఠ్మలానీ
తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు, తదనంతరం వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇంకా వేడి పుట్టిస్తూనే ఉన్నాయి. తెలంగాణ సర్కారును ఇరుకున పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో తన వాదనను బలంగా వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ సర్కారు, తన న్యాయవాదిగా దేశంలోనే ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడిగా పేరుగాంచిన రాం జెఠ్మలానీని రంగంలోకి దించింది. తెలంగాణ తరఫున జెఠ్మలానీ హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్నారు.