: కలాంకు తుది నివాళి అర్పించిన మోదీ, చంద్రబాబు, రాహుల్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పారికర్ లతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు, త్రివిధ దళాధిపతులు తుది నివాళి అర్పించారు. కాసేపట్లో కలాం అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా రామేశ్వరం జనసంద్రమైంది. దాదాపు లక్షమంది ప్రజలు కలాం అంత్యక్రియలకు తరలి వచ్చారని సమాచారం.