: కలాం అంతిమ యాత్ర ప్రారంభం... కాసేపట్లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు


భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. రామేశ్వరం లోని ఆయన నివాసం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆయన భౌతికకాయంపై ఆకుపచ్చ వస్త్రం కప్పి భుజాల మీద మోసుకుంటూ సైనికులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సైనికాధికారులు రామేశ్వరం చేరుకున్నారు. 11 గంటలకు కలాంకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. కలాం అంత్యక్రియల నేపథ్యంలో, రామేశ్వరానికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. మహోన్నత మనిషికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు.

  • Loading...

More Telugu News