: కుటుంబ సభ్యులకు మెమన్ మృతదేహం అప్పగింత... ముంబైకి తరలింపు


ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మృతదేహం కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులకు అందింది. నేటి ఉదయం యాకుబ్ ను ఉరి తీసిన నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాకుబ్ మృతదేహంతో అతడి కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం నాగ్ పూర్ నుంచి ముంబై బయలుదేరారు. వారి వెంట పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా బయలుదేరారు. మరోవైపు యాకుబ్ మృతదేహానికి అంత్యక్రియల నేపథ్యంలో ముంబైలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News