: రామేశ్వరంలోని సొంతింటిలో కలాం భౌతిక కాయం... నివాళికి క్యూ కట్టిన జనం


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయాన్ని తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన సొంతింటిలో ఉంచారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తకు నివాళి అర్పించేందుకు తమిళులు పెద్ద సంఖ్యలో అక్కడ బారులు తీరారు. మూడు రోజుల క్రితం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఐఐటీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కలాం ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రికి తరలించేలోగానే తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత తొలుత ఢిల్లీ, తదనంతరం మధురై మీదుగా కేంద్ర ప్రభుత్వం ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరంలోని ఆయన సొంతింటికి చేర్చిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 11 గంటలకు కలాం భౌతిక కాయానికి రామేశ్వరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News