: రకుల్ ప్రీత్ సింగ్ కోసం ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిని మూసివేశారు!
సినీ నటి వస్తోందని హైదరాబాదు పోలీసులు ప్రధాన రహదారిని మూసేసి విమర్శల పాలయ్యారు. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ పక్కన 'బహార్ కేఫ్' హోటల్ ప్రారంభోత్సవానికి సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. దీంతో పోలీసులు మూడు గంటలపాటు ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిని మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి మూసేయడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటి వస్తే ఇంత హడావుడి ఎందుకు? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.