: కలాం నోట తెలంగాణ మాట విని ఉద్వేగానికి లోనయ్యా: వినోద్


గుండెపోటు కారణంగా కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడారు. 2004లో కలాం తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని కూడా చేర్చారని వినోద్ తెలిపారు. అందరితోనూ సంప్రదింపులు జరిపి సరైన సమయంలో తెలంగాణ ఇస్తామని కలాం పేర్కొన్నట్టు చెప్పారు. రాష్ట్రపతి నోట తెలంగాణ మాట విని ఓ పార్లమెంటు సభ్యుడిగా ఎంతో ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు.

  • Loading...

More Telugu News