: ముంబై, నాగ్ పూర్ లో హై అలెర్ట్...పోలీసుల పహారా
యాకూబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, నాగ్ పూర్ లలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ రెండు నగరాలలోని పోలీసుల సెలవులు ఎత్తేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రత కట్టుదిట్టం చేశారు. మెమన్ ఉరిశిక్ష, లేదా న్యాయస్ధానం తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగ్ పూర్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.