: నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది: ఒవైసీ
యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారు చేయడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి యాకూబ్ మెమన్ కాదని, అందువల్ల అతనికి ఉరిశిక్షే సరైనదని భావించలేమని గతంలో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారని తెలిపారు. వాటిని ఇతర న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.