: క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ తో కలసి భోజనం చేసిన ప్రత్యూష
తండ్రి, సవతి తల్లి చేతిలో తీవ్ర హింసకు గురై బయటపడి కోలుకున్న ప్రత్యూష హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది. ఇంటికి వచ్చిన ఆమెను సీఎం ఆప్యాయంగా పలకరించి ఆహ్వానం పలికారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కలసి ప్రత్యూష భోజనం చేసింది. సీఎంతో పాటు మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, తదితరులు కూడా భోజనం చేశారు. తరువాత కేసీఆర్ సతీమణి శోభతో ప్రత్యూష కాసేపు ముచ్చటించింది.