: తెలంగాణలో గ్రూపుల వారీగా పోస్టుల విభజన... 'గ్రూప్-3' కింద 17 రకాల పోస్టులు
తెలంగాణలో ఇటీవల ప్రకటించిన 15వేల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ఉద్యోగాల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్-1,2,3 వారీగా పోస్టులు విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తాజాగా ప్రవేశపెట్టిన గ్రూప్-3 కింద 17 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. గ్రూప్-1 కింద డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది. దానికి వెయ్యి మార్కులతో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా పేపర్-6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్ ను చేర్చారు. గ్రూప్-2లో 12 రకాల పోస్టులు ఉన్నాయి.