: రాజీవ్ హంతకుల శిక్షపై కేంద్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
రాజీవ్ గాంధీ హంతకుల మరణశిక్షను జీవితకాల శిక్షగా మార్చడంపై సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శాంతన్, మురుగన్, పెరారీవలన్ లు పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో గతేడాది వారు సుప్రీంను ఆశ్రయించారు. దాంతో అదే సంవత్సరంలో ఫిబ్రవరి 14న వారి మరణశిక్షను జీవితకాల శిక్షగా మారుస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో రాజీవ్ ను హత్య చేసిన హంతకులకు క్షమాభిక్ష పెట్టే అవకాశమే లేదని క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో వారి శిక్షపై ఇచ్చిన తీర్పుపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోర్టును కోరింది.