: రామేశ్వరం చేరుకున్న కలాం పార్థివదేహం
దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పార్థివదేహం ఆయన స్వగ్రామమైన రామేశ్వరం చేరుకుంది. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎయిర్ ఫోర్స్ విమానంలో మధురై తరలించారు. అక్కడ నుంచి రామేశ్వరంకు హెలికాప్టర్ లో తరలించారు. రామేశ్వరంలోని బస్టాండ్ వద్ద ఉన్న మైదానంలో ప్రజల సందర్శనార్థం కలాం పార్థివదేహాన్ని ఉంచుతారు. రేపు ఉదయం ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పలువులు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు.