: ప్రజాసేవకోసం జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తి కలాం!: ఒబామా
కోట్లాది భారతీయులతో పాటు ప్రపంచంలో ఎంతో మందిలో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్పూర్తి నింపారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల అమెరికా ప్రజల తరపున భారతీయులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా- భారత్ ల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కలాం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ప్రజాసేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతామూర్తి అని కొనియాడారు. అందుకే ఆయన ప్రజల రాష్ట్రపతిగా పేరుపొందారన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా ఆయన స్వదేశంలోనేకాక విదేశాల్లోనూ అభిమానం, గౌరవం సంపాదించుకున్నారని ఒబామా పేర్కొన్నారు.