: కేసీఆర్ నివాసానికి ప్రత్యూషను తరలించండి... పోలీసులకు హైకోర్టు ఆదేశం


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రి పాలైన బాలిక ప్రత్యూషను తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికి తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ప్రత్యూషతో మీడియా, న్యాయవాదులు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హైకోర్టు పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యూషను పోలీసులు కేసీఆర్ నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటినిండా గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రత్యూషను కొన్నాళ్ల క్రితం తొలుత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆ తర్వాత కేసీఆర్ సతీసమేతంగా ఆస్పత్రికి వచ్చి ప్రత్యూష యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషను చదివించడంతో పాటు పెళ్లి కూడా చేస్తానని, తన ఇంటిలోనే ఆశ్రయం కల్పిస్తానని ఆ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. నాటి కేసీఆర్ ప్రకటన మేరకే హైకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News