: హెచ్ఐవీపై ఇండియాను తట్టిలేపిన సునీతి సాల్మన్ కన్నుమూత


వేలాది మంది ఎయిడ్స్ రోగులకు జీవితంపై అవగాహన కల్పిస్తూ, ఎంతో మంది వైద్యులకు ఆదర్శప్రాయంగా నిలిచిన డాక్టర్ సునీతి సాల్మన్ (76) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు. ఇండియాకు ఎయిడ్స్ వ్యాధి కారక వైరస్ వచ్చిందని తొలుత గుర్తించింది ఈవిడే. అది జూలై 22, 1987... 33 సంవత్సరాల నూరి అనే సెక్స్ వర్కర్ రక్తాన్ని పరీక్షించాల్సి వచ్చింది. అప్పటికి ఎయిడ్స్ అనే ఒక వ్యాధి ఉందని అతికొద్ది మంది వైద్య నిపుణులకు మాత్రమే తెలుసు. ఆమెకు హెచ్ఐవీ సోకిందని, ఆమె వర్గంలోని ఇతర మహిళలకు శరవేగంగా వస్తోందని సునీతి కనుగొన్నారు. ఇండియాలో హెచ్ఐవీ వైరస్ ఉందని తొలి డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని ప్రభుత్వం ముందుంచారు. అప్పటి నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు ఓ మైక్రోబయాలజిస్టుగా సేవలందిస్తూ, హెచ్ఐవీ రోగుల్లో స్ఫూర్తిని నింపుతూ పేరు తెచ్చుకున్నారు. 25 బ్యాచ్ ల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, ఆపై ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న సునీతి మృతిపట్ల పలువురు ప్రముఖ వైద్యులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News