: తూర్పుగోదావరి జిల్లాలో 'పెద్ద పాదం'... దేవుడి పాదమంటూ స్థానికుల పూజలు
జనాల వెర్రికి అంతులేకుండా పోతోంది. ఏది కనపడినా దైవలీల అంటూ పూజలకు క్యూ కడుతున్నారు. పుణ్యం కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొత్తలంక గ్రామానికి చెందిన పొలాల వద్ద ఉన్న మట్టిలో 'పెద్ద పాదం' ఆకారంలో ఓ ముద్ర వెలుగుచూసింది. దాంతో, అది దేవుడి పాదమే అంటూ జనాలు క్యూ కడుతున్నారు. పాదానికి పూలు పెట్టి, కుంకుమ వేసి, కొబ్బరి కాయలు కొడుతూ పూజలు చేస్తున్నారు. పాదాన్ని చూసేందుకు జనాలు కూడా భారీగానే వస్తున్నారు. ఈ సందర్భంగా ఒకావిడ మాట్లాడుతూ, ఇది ఆంజనేయ స్వామి పాదంలాగానే ఉంది అంటూ సెలవిచ్చింది.