: చర్లపల్లి జైల్లో గంజాయి నిల్వలు... బ్రహ్మపుత్ర బ్లాక్ లో కిలోన్నర డ్రగ్ పట్టివేత
హైదరాబాదులోని కేంద్ర కారాగారం చర్లపల్లి సెంట్రల్ జైల్లో నేటి ఉదయం కలకలం రేగింది. ఖైదీలు మినహా ఇతర వ్యక్తుల ప్రమేయంపై పూర్తి స్థాయి నిషేధం ఉన్న జైల్లో సోదాలు చేసిన పోలీసులకు పెద్ద మొత్తంలో గంజాయి లభించింది. జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్ లో దాదాపు కిలోన్నరకు పైగా గంజాయిని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జైల్లోని ఖైదీలకు సెల్ ఫోన్లు అందుతున్నాయన్న విషయంపై గతంలో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా కిలోల లెక్కన గంజాయి లభించడంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.