: అబ్దుల్ కలాంపై పాకిస్థాన్ అక్కసు
మహామనిషి, క్షిపణి పితామహుడు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పై పాకిస్థాన్ అక్కసు ప్రదర్శించింది. ఆయన కేవలం సాధారణ శాస్త్రవేత్త మాత్రమేనని పాక్ సైంటిస్టు అబ్దుల్ ఖాదీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. "భారత మిసైల్ ప్రోగ్రామును రష్యా అభివృద్ధి చేసింది. కలాం దానికి ఎటువంటి మార్పులూ చేయలేదు" అని ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం, ఆస్ట్రో-ఫిజిక్స్ విభాగాల విస్తృతికి ఆయన ఎటువంటి సేవలూ చేసినట్టు తనకు గుర్తు లేదని అక్కసు కక్కారు. ఆయన రాష్ట్రపతి పదవికి కూడా అనర్హుడని అన్నాడు. కేవలం ముస్లిం ఓట్ల కోసమే 2002లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్రపతిగా ఎంపిక చేసిందని విమర్శించారు. పాకిస్థాన్ అణు పితామహుడిగా పేరు తెచ్చుకుని, ఆపై అణ్వస్త్ర విజ్ఞానాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఏకే ఖాన్, కలాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.