: కలాం మరణంపై షిల్లాంగ్ ఆసుపత్రి వివరణ
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయిన వెంటనే ఆయనను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి వచ్చేలోపలే ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేశాయి. "27వ తేదీ సాయంత్రం 7 గంటలకు కలాంను ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించాం. అప్పటికే ఆయనలో శ్వాస ఆగిపోయింది. నాడి కూడా కొట్టుకోవడం లేదు. బీపీ కూడా రికార్డు కాలేదు. అయినప్పటికీ, ఐసీయూకు తరలించి శత విధాలా ప్రయత్నించాం. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో, సాయంత్రం 7.45 గంటలకు కలాం మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించాం" అని బెథానీ ఆసుపత్రి వర్గాలు ప్రకటన చేశాయి.