: ప్రభుత్వ ఉద్యోగం కావాలా నాయనా?!


తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో 4,326 పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలి విడతతో పాటు ఆపై జారీ అయ్యే నోటిఫికేషన్ల తరువాత, ఉద్యోగాలకు పోటీ పడాలంటే అభ్యర్థులు పలుమార్లు దరఖాస్తులు చేసుకోవాల్సిన పని లేదు. వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం 'www.tspsc.gov.in' అనే వెబ్ సైట్లో ఒకసారి బయోడేటాను అప్ లోడ్ చేస్తే చాలు. ఒకసారి అప్ లోడ్ చేసిన దరఖాస్తును భవిష్యత్తులో ఎన్నిసార్లయినా అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రతిసారీ దరఖాస్తులు చేయడం కోసం నిరుద్యోగులు ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాటు చేశామని టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ వివరించారు. ఈ సేవలు నిరుద్యోగులకు ఉచితంగా అందుతాయని తెలిపారు. నోటిఫికేషన్లు పడ్డప్పుడు వీరికి ఈ-మెయిల్, మెసేజ్ రూపంలో సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News