: వట్టినాగులపల్లి ఎంపీటీసీ టీడీపీ కైవసం...మూడో స్థానంతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్!


తెలంగాణలో విపక్ష తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఆ పార్టీ నేత, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి ఎంపీటీసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వట్టినాగులపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ స్థానంలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన వెంకటేశ్ 378 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ద్వితీయ స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News