: ఢిల్లీ టూ రామేశ్వరం... పాలం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కలాం పార్థివ దేహం
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి రామేశ్వరం బయలుదేరింది. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కలాం భౌతిక కాయంతో వాయుసేన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితం మధురై బయలుదేరింది. నేటి ఉదయం 10 గంటల సమయంలో ఈ విమానం తమిళనాడులోని మధురైకి చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భౌతిక కాయాన్ని రామనాథపురం జిల్లాలోని ఆయన సొంతూరు రామేశ్వరానికి తరలించనున్నారు. కలాం పార్థివ దేహం వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ లు వెళుతున్నారు.