: సెక్షన్ 8 బాధ్యత గవర్నర్ దే: కేంద్ర హోం శాఖ
సెక్షన్-8పై గైడ్ లైన్స్ ఇవ్వాలని విభజన చట్టంలో లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం చెబుతూ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తకుండా కేంద్రం తరచూ సమావేశాలు నిర్వహిస్తుందని అన్నారు. విభజన చట్టం అమలును కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. సెక్షన్-8 బాధ్యత గవర్నర్ దేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో కీలక సంస్థల విషయంలోను, శాంతి భద్రతల విషయంలోను గవర్నర్ తన విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు.