: 30న సెలవు దినంగా ప్రకటించిన తమిళనాడు


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు నిర్వహించే రోజున తమిళనాడు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. తమిళనాడులోని రామేశ్వరంకు చెందిన కలాంకు ఘననివాళి అర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కలాం అంత్యక్రియలను ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ఆయన స్వగ్రామంలో అధికార లాంఛనాలతో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా, రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి రామేశ్వరంకు కలాం పార్థివదేహాన్ని తరలించనున్నారు.

  • Loading...

More Telugu News