: అప్పుడు ఆత్మహత్య చేసుకుందామని భావించా...ఇప్పుడు మచ్చతొలగిపోయింది: శ్రీశాంత్


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో తీహార్ జైలులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ మచ్చ తొలగిపోవడంతో కొచ్చిలో ఆయన మాట్లాడుతూ, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్ మెంట్ కోరానని తెలిపాడు. తనపై బీసీసీఐ సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అరెస్టు చేసినప్పుడు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని శ్రీశాంత్ తెలిపాడు. శివారాధనతోనే తాను ప్రశాంతంగా ఉండగలిగానని ఆయన చెప్పాడు. స్పాట్ ఫిక్సింగ్ మచ్చ తొలగిపోవడంతో తనపై విధించిన జీవితకాల నిషేధం ఎత్తివేయాలని కోరనున్నానని శ్రీ చెప్పాడు. తనపై నిషేధం ఎత్తివేయగానే ప్రాక్టీస్ ప్రారంభిస్తానని శ్రీశాంత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News