: షార్ లో కలాంకు ఘన నివాళి
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులర్పించారు. ఇక్కడి బ్రహ్మప్రకాశ్ హాల్ లో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, షార్ డైరెక్టర్ కున్నికృష్ణన్, షార్ శాస్త్రవేత్తలు నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కస్తూరి రంగన్ మాట్లాడుతూ, దేశం మహనీయుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.