: ఐఐఎం విద్యార్థులకు కలాం ఇవ్వాలనుకున్న అసైన్ మెంట్ ఇదే


దేశం అంటే వల్లమాలిన అభిమానం కలిగిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరి శ్వాస వరకు విద్యార్థులకు భవిష్యత్ నిర్దేశనం చేస్తూనే ఉన్నారు. చివరిసారి మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లో ఐఐఎం విద్యార్థులకు చేసిన ప్రసంగం అనంతరం వారికి ఆసక్తికరమైన అసైన్ మెంట్ ఇవ్వాలని భావించారట. కానీ, మధ్యలోనే తీవ్రమైన గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. అయితే ఆయన ఇవ్వాలనుకున్న అసైన్ మెంట్ ఏంటంటే...గత కొద్ది రోజులుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగింది లేదు. దీంతో కలత చెందిన ఆయన పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు, సభను అడ్డుకునే చర్యలకు స్వస్తి చెప్పేందుకు వినూత్న ఆలోచనలు చెప్పాలని విద్యార్థులను కోరాలనుకున్నారని కలాంతో పాటు గెస్ట్ లెక్చర్ ఇవ్వాల్సిన శ్రీజన్ పాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News