: నివాళులర్పించేందుకు నేతలు క్యూ కట్టారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివదేహానికి నివాళులర్పించేందుకు నేతలు క్యూ కట్టారు. వీఐపీలతో ఢిల్లీ లోని రాజాజీ మార్గ్ కిటకిటలాడుతోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు దేశంలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలు కలాం మృతదేహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సీఎం రమేష్, అవినాష్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి, శాస్త్రవేత్తలు, అధికారులు కలాం పార్థివ దేహాన్ని చివరిసారి చూసేందుకు బారులుతీరారు. రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో కలాంతో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధం ఉన్నవారంతా ఆయన కడచూపుకు తరలివచ్చారు. కాగా, 4 గంటల నుంచి సాధారణ ప్రజలను ఆయన భౌతిక కాయం చూసేందుకు అనుమతించనున్నారు.