: నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు... టీఆర్ఎస్ లోనే ఉంటా: రాజయ్య
తాను టీఆర్ఎస్ నుంచి వైదొలగబోతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. తానసలు పార్టీ మారవలసిన అవసరం లేదని, టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేగాక తాను కాంగ్రెస్ లో చేరి వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మీడియాలో వస్తున్న కథనాలు ఊహాజనితమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా పాల్గొంటానన్నారు. ఇటీవల మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ తలచుకుంటేనే పదవులు వస్తాయని, డిమాండ్లు చేస్తే రావంటూ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తెరలేపాయి. ఈ క్రమంలోనే రాజయ్య పైవిధంగా స్పందించారు.