: తిరుమల వెంకన్నకు రూ. 3 కోట్ల ఆస్తి రాసిస్తానంటున్న వృద్ధురాలు
తనకు చెందిన రూ. 3 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల వెంకన్నకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కడిగిరి గ్రామానికి చెందిన పద్మావతమ్మ (70) చెప్పారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు రావాలని కోరారు. నిన్న తిరుమల వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని... టీటీడీ అధికారులు ముందుకొస్తే, తన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వెంకన్నకు రాసిస్తానని చెప్పారు. ఇదే సమయంలో, తన ఆరోగ్యం కుదుటపడేందుకు టీటీడీ అధికారులు సహాయం చేయాలని విన్నవించారు.