: తెలుగు నేలతో కలాం బంధం విడదీయరానిది!


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో ఏపీకి విడదీయరాని బంధముంది. తమిళనాడుకు చెందిన కలాం, విద్యాభ్యాసం తర్వాత తన ఉద్యోగ జీవితాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆరంభించారు. డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్ డీఓ) లో సైంటిస్ట్ గా చేరిన ఆయన ఏపీలోనే విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత డీఆర్ డీఓ నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అప్పటిదాకా ఒక్క కేరళలోనే రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండేది. అయితే మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలచిన అప్పటి ప్రదాని ఇందిరా గాంధీ ఆ బాధ్యతలను కలాంకు అప్పజెప్పారు. ఈ క్రమంలో కేరళ నుంచి ఏపీ దాకా సముద్ర తీరంపై హెలికాప్టర్ లో ప్రయాణించిన కలాం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటను అందుకు ఎంపిక చేశారు. కలాం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, అక్కడే సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) ఏర్పాటు చేసింది. అంటే, శ్రీహరికోట లో షార్ ఏర్పాటుకు కలాం అంకురార్పణ చేశారు. అంతేకాక అక్కడి నుంచి తొలి రాకెట్ ప్రయోగం కూడా కలాం ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కేర్ హాస్పిటల్ కు చాలాకాలం పాటు ఆయన చీఫ్ మెంటార్ గానూ వ్యవహరించారు. ఇక భారత రాష్ట్రపతిగా ఆయన పదవి చేపట్టడంలోనూ తెలుగు నేలకు చెందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక భూమిక పోషించారు.

  • Loading...

More Telugu News