: ‘కలాం-రాజు' స్టెంట్ పేదలకు వరం... తెలుగు వైద్యుడు సోమరాజుతో కలిసి కలాం రూపకల్పన


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్తే కాదు, పేద రోగుల పాలిట కలియుగ దైవమనే చెప్పాలి. ఆది నుంచి గుండె జబ్బుల చికిత్స అత్యంత ఖరీదైనదిగానే ఉంటూ వస్తోంది. గుండె సంబంధిత రోగాలతో బాధపతున్న వారికి రక్త ప్రసరణలో తలెత్తే అవాంతరాలను తొలగించేందుకు స్టెంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 1994 వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టెంట్లే మనకు దిక్కు. ఈ తరహా స్టెంట్ల ఖరీదు ఒక్కోటి రూ.2 నుంచి 3 లక్షల దాకా ఉండేది. అయితే హైదారాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కేర్ హాస్పిటల్ చైర్మన్ సోమరాజు, కలాంలు తక్కువ ఖర్చుతో స్టెంట్లను తయారు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో కలాం విస్తృత పరిశోధనలు సాగించి తక్కువ ఖరీదుతో లభించే స్టెంట్లను రూపొందించారు. దీంతో 1994 దాకా రూ.3 లక్షల దాకా పలికిన స్టెంట్ల ఖరీదు, ఆ తర్వాత రూ.50 వేలకు దిగివచ్చింది. ఇక ఫ్లోర్ రియాక్షన్ ఆర్థోసిస్ పేరిట కలాం తయారు చేసిన తేలికైన కాలిపర్స్ వికలాంగులకూ ఉపశమనం కల్పించాయి.

  • Loading...

More Telugu News