: కలాంకు కేంద్ర కేబినెట్ నివాళి... రామేశ్వరంలోనే రేపు అంత్యక్రియలు
భారతరత్న అబ్దుల్ కలాంకు కేంద్ర కేబినెట్ ఘన నివాళి అర్పించింది. కలాం మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపింది. దీనికితోడు, అబ్దుల్ కలాం స్వగ్రామమైన రామేశ్వరంలో రేపు అంత్యక్రియలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. కలాంకు నివాళిగా ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది. భరత మాత తన ముద్దు బిడ్డను కోల్పోయిందని కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.