: తెలంగాణలో ఇక కొలువుల జాతర... 15,522 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్


కొత్త రాష్ట్రం తెలంగాణలో కొలువుల జాతరకు తొలి అడుగు పడింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 15,522 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా 3,783 పోస్టులు భర్తీ కానున్నాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 9,058 పోస్టులు, విద్యుత్ శాఖ ద్వారా 2,681 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ కార్యదర్శి ఎన్. శివశంకర్ ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News