: ఉగ్రవాదులపైకి బస్సుతో దూసుకెళ్లిన దీనానగర్ డ్రైవర్.... తోకముడిచిన ముష్కరులు


పంజాబ్ లోని దీనానగర్ లో నిన్న పంజా విసిరిన ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసేవారే. అందుకు వారు పక్కాగా ప్రణాళిక రచించుకుని మరీ దేశంలోకి చొరబడ్డారు. అయితే దీనానగర్ కు చెందిన బస్సు డ్రైవర్ నానక్ చంద్ సమయస్ఫూర్తి, ధైర్యం ముందు ఉగ్రవాదుల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కాక తప్పలేదు. నిన్న తెల్లవారుజామున దీనానగర్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు బస్టాండ్ సమీపంలో నిండా 75 మంది ప్రయాణికులతో అటుగా వెళుతున్న బస్సుపై దాడి చేశారు. ప్రయాణికులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. అయితే సదరు బస్సు డ్రైవర్ నానక్ చంద్ ఉగ్రవాదుల కాల్పులకు ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. బస్సును నేరుగా ఉగ్రవాదులపైకే దుమికించారు. తమపైకి వేగంగా దూసుకువస్తున్న బస్సును చూసి ఉగ్రవాదులు బెంబేలెత్తారు. వెనకడుగేశారు. ఆ తర్వాత నానక్ చంద్ బస్సును నేరుగా ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లి అపేశారు. ఉగ్రవాదుల కాల్పుల సందర్భంగా నానక్ చంద్ బస్సును వదిలి పరారైనా, బస్సును ఉగ్రవాదులపైకి దుమికించకపోయివుంటే కనుక, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండేవారే.

  • Loading...

More Telugu News