: 10 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ... కలాం అంత్యక్రియలపై చర్చ
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన కలాం, అక్కడి బెథాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో కలాం అంత్యక్రియలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులతో భేటీ కానున్నారు. నేటి ఉదయం 10 గంటలకు భేటీ కానున్న కేంద్ర కేబినెట్ కలాం అంత్యక్రియలపై చర్చించనుంది. ఆయన అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలి? చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.