: కాకతాళీయం, ఆయనతో మధ్యాహ్నమే మాట్లాడా... అంతలోనే వెళ్లిపోయారు!: వెంకయ్యనాయుడు
కాకతాళీయంగా ఈ రోజు మధ్యాహ్నమే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో మాట్లాడానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఆగస్టు 17న పాలుపంచుకోవాలని కోరితే ఆయన అంగీకరించారని ఆయన తెలిపారు. మరోసారి ఆయన అపాయింట్ మెంట్ ఖరారు చేసుకుందామని అనుకునేలోపు ఆయన మరణవార్త వినాల్సి రావడం బాధాకరమని ఆయన తెలిపారు. కలలు కని, వాటిని నిజం చేయడమే భరత మాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు నిజమైన నివాళి అర్పించడమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయసభలు రేపు ఆయనకు నివాళి అర్పిస్తాయి. అనంతరం శోక దినంగా రేపు ప్రకటించి, సెలవుగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయన చరితార్ధమయ్యారని ఆయన కొనియాడారు. ఆయన బాటలో పయనించడమే ఆయనకు నివాళి అర్పించడమనని ఆయన చెప్పారు.