: కలాం మరణం భారత జాతికి తీరని లోటు: నరసింహన్, బాబు, కేసీఆర్, జగన్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం భారత జాతికి తీరని లోటని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. కలాం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వారు, ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. కలాం లేని లోటు భర్తీ కాదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలాంతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. కాగా, కలాం మృతి పట్ల దేశం యావత్తూ సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సందేశాలు పోస్టు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.