: పాలిటిక్స్ లోకి వచ్చేందుకు తహతహలాడుతున్న డైలాగ్ కింగ్
రాజకీయాలు తన వ్యక్తిత్వానికి పొసగవంటూ గతంలో పక్కకు తప్పుకున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు. అయితే, నూతన పార్టీ పెట్టే ఉద్ధేశం లేదని స్పష్టం చేశారు. అలా చేసి డబ్బులు సంపాదించుకునే సామర్థ్యం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరుపున 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం చంద్రబాబుతో విభేదాల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు అప్పట్లో పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళేది తెలియరాలేదు.