: హైదరాబాదులో ప్రతి ఇంటికీ నీరందాలి: అధికారులకు కేసీఆర్ సూచన
హైదరాబాదులో ప్రతి ఇంటికీ నీరందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. హైదరాబాదులో మంచి నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ నీరందించే ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాదులో మంచినీటి కొరత లేదన్న అభిప్రాయం రావాలని ఆయన తెలిపారు. గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు సరిపడా నీరందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాదీలకు త్వరలోనే 32 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.