: రోడ్డుపై పేలుడు...ఉలిక్కిపడిన పార్లమెంటు
పార్లమెంటును పేలుడు శబ్దం వణికించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై వాడిగా వేడిగా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఈ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అక్కడి వారు ఆందోళన చెందారు. ఉగ్రదాడి జరిగిందేమోనని అనుమానించారు. దీంతో, ఏం జరుగుతోందంటూ ఆరాతీశారు. విషయం తెలియని పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పేలుడు ఎక్కడ్నుంచి వచ్చింది? ఏం జరిగింది? అంటూ పరుగులు తీశారు. దీంతో అసలు విషయం తెలిసింది. అది విజయ్ ఘాట్ వద్ద రోడ్డు మీద వెళ్తున్న ఓ వాహనం టైరు పేలుడని తెలుసుకున్నారు. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.