: మోదీ వ్యతిరేక వ్యాఖ్యలపై స్పందించిన నేహా ధూపియా


'పాలన అంటే సెల్ఫీ విత్ డాటర్, యోగా డేలు నిర్వహించడం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడడం' అంటూ తాను ఈమధ్య చేసిన వ్యాఖ్యలపై సినీ నటి నేహా ధూపియా స్పందించింది. ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వర్గం ప్రజలు ఆమె నటన, చేసిన పాత్రలు, ప్రస్తుత అవకాశాలు, వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించారు. కొంత మంది ఆమె ఇంటి వద్ద ఆందోళన కూడా నిర్వహించారు. దీంతో, ఆమె తన ట్విట్టర్ వ్యాఖ్యలపై స్పందించింది. ముంబైలో వర్షాలు కురిసి జనజీవనం స్తంభించిపోతోందని, అలాంటప్పుడు ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదనతోనే అలా ట్వీట్ చేశానని, ఎవరినో ఉద్దేశించి అలా ట్వీట్ చేయలేదని ఆమె స్పష్టం చేసింది. నిరసనకారులు తన ఇంటి వద్ద ఆందోళన చేసినప్పుడు రక్షణ కల్పించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News